పేపర్లు లీక్‌ చేసి రూ.వేల కోట్లకు  అమ్ముకున్నారు!

24 Sep, 2023 02:16 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై ప్రవీణ్‌ కుమార్‌ ధ్వజం

సాక్షి, పెద్దపల్లి: టీఎస్‌పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్‌ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు.

జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్‌పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్‌ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు. చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు