ZIM vs AFG: నజీబుల్లా మెరుపు ఇన్నింగ్స్‌.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు

12 Jun, 2022 09:11 IST|Sakshi

హరారే వేదికగా జింబాబ్వేతో జరగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, గుర్భాజ్‌ అద్భుతమైన అరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83పరుగులు జోడించారు. అయితే ర్యాన్ బర్ల్ వేసిన 11 ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్గాన్‌ కాస్త ఒత్తిడికి గురైంది.

అయితే అఖరిలో నజీబుల్లా జద్రాన్ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో విజయం ఆఫ్ఘనిస్తాన్ వశమైంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో నజీబుల్లా జద్రాన్(44), హజ్రతుల్లా జజాయ్(45) పరుగులతో రాణించారు. ఇక ​జింబాబ్వే బౌలర్లలో ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు, ల్యూక్ జోంగ్వే ఒక్క వికెట్‌ సాధించారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కల్పోయి 159 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్‌ రజా(45) మాధేవేరే(32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నిజత్ మసూద్ మూడు వికెట్లు,ఫజల్హక్ ఫరూఖీ, నబీ, రషీద్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.
చదవండి: SL vs AUS: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..!

మరిన్ని వార్తలు