Asia Cup 2022 Schedule: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

2 Aug, 2022 17:14 IST|Sakshi

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌ వచ్చేసింది. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఈనెల (ఆగస్ట్‌) 27 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దుబాయ్‌ వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్‌-పాక్‌) ఆగస్ట్‌ 28న జరుగనుంది.  షెడ్యూల్‌ పూర్తి వివరాలను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా ట్విటర్‌ వేదికగా మంగళవారం ప్రకటించారు.  

ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో పాటు ఓ క్వాలిఫయర్ టీమ్ కూడా పాల్గొంటోంది. అర్హత పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు ఆసియా అగ్ర జట్లతో ఆడే అవకాశం లభిస్తుంది. క్వాలిఫైయింగ్ పోటీల్లో యూఏఈ, సింగపూర్, హాంకాంగ్, కువైట్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌ ఏలో భారత్‌, పాక్‌లతో పాటు క్వాలిఫయన్‌ జట్టు, గ్రూప్‌ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి.  ఆగస్టు 27న మొదలయ్యే ఈ మెగా టోర్నీ సెప్టెంబరు 11న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 


చదవండి: IND vs WI: విండీస్‌తో మూడో టీ20.. శ్రేయస్‌ అవుట్‌! హుడాకు ఛాన్స్‌!


 

మరిన్ని వార్తలు