ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌.. భారత మాజీ బాక్సర్‌ కన్నుమూత

10 Jun, 2021 10:08 IST|Sakshi

ఇంఫాల్‌: భారత మాజీ బాక్సర్‌.. ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ డింగ్కో సింగ్(42) అనారోగ్యంతో గురువారం కన్నుమూశాడు. మణిపూర్‌కు చెందిన డింగ్కో సింగ్‌ 2017లో లివర్‌ క్యాన్సర్‌ బారీన పడ్డారు. 2020లో ఢిల్లీలోని లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సన్‌(ఐఎల్‌బీఎస్‌) రేడియేషన్‌ థెరపీ చేయించుకున్న ఆయన కాస్త కోలుకున్నట్లే కనిపించారు. కానీ కొద్దిరోజులకే కరోనా సోకడం.. దాని నుంచి కోలుకున్నప్పటికి తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు.

బ్యాంకాక్‌ వేదికగా 1998లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అందరి దృష్టిలో పడ్డాడు. 16 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌ విభాగం నుంచి దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చిన ఆటగాడిగా డింగ్కో సింగ్‌ నిలిచాడు. 1998లో అర్జున అవార్డు పొందిన డింగ్కో సింగ్‌ 2013లో భారత అత్యున్నత నాలుగో పురస్కారం పద్మ శ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌కు వెళ్లని డింగ్కో సింగ్‌ ఇండియన్‌ నేవికి సేవలందించడంతో పాటు బాక్సింగ్‌ కోచ్‌గాను పనిచేశాడు. డింగ్కో సింగ్‌ మృతిపై ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌తో పాటు.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన మహిళ బాక్సర్‌ మేరీకోమ్‌ అతని మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు. 
చదవండి: Indian Olympic Association: మాకొద్దీ చైనా దుస్తులు!

మరిన్ని వార్తలు