Ind Vs NZ Series: న్యూజిలాండ్‌ సిరీస్‌కు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌!

14 Oct, 2021 12:45 IST|Sakshi

Rahul Dravid As Team India Coach For New Zeleand Series.. రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌ ఎవరు అవుతారనేది పెద్ద సమస్యగా మారిపోయింది. టి20 ప్రపంచకప్‌ అనంతరం రవిశాస్త్రి కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే.  కాగా కోచ్‌ పదవిపై ఆయన ఆసక్తి చూపకపోవడంతో టీమిండియాకు కొత్త కోచ్‌ అనివార్యంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం టి20 ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌కు ద్రవిడ్‌ను టీమిండియా తాత్కాలిక కోచ్‌గా ఉండాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. 

చదవండి: ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్‌ పట్టారు.. ఊహించని ట్విస్ట్‌

ఇదే విషయమై ఒక బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు. ''న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా కోచ్‌గా పనిచేయాలంటూ ద్రవిడ్‌ను కోరిన మాట నిజమే. దక్షిణాప్రికా టూర్‌ వరకు కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తామని.. అప్పటివరకు ఆ పదవిలో  ఉండాలని ద్రవిడ్‌ను కోరాం. అందుకు ఆయన సముఖుత వ్యక్తం చేశారు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌ వరకు ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనే కొత్త కోచ్‌కు సంబంధించి ప్రాసెస్‌ జరుగుతూనే ఉంటుంది. టీమిండియా కోచ్‌గా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు  ద్రవిడ్‌ ఇష్టపడకపోవడం వెనుక ఫ్యామిలీకి ఎక్కువ టైమ్‌ కేటాయించాలనుకోవడమే. టీమిండియాకు ఉండే బిజీ షెడ్యూల్‌ కారణంగా తాను కూడా పూర్తిగా టీమిండియాతో ఉండాలన్న షరతుపై ద్రవిడ్‌ ఇష్టపడడం లేదు '' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: Team India head Coach: రవిశాస్త్రి స్థానంలో ఆయనా?!

కాగా టీమిండియా కోచ్‌ పదవికి ద్రవిడ్‌తో పాటు పలువురి పేర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా అనిల్‌ కుంబ్లే టీమిండియా కోచ్‌ పదవిని మరోసారి చేపడతాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీని వెనుక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే కుంబ్లే కోచ్‌గా రావడంపై కోహ్లి సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక సమయంలో టీమిండియా విదేశీ కోచ్‌లు వస్తున్నారని.. టామ్‌ మూడీ, లాన్స్‌ క్లుసేనర్‌, రికీ పాంటింగ్‌ లాంటి వారు టీమిండియా కోచ్‌ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అయితే టీమిండియా ప్రతీ సీజన్‌లో కనీసం 50 మ్యాచ్‌లతో బిజీగా ఉండడంతో విదేశీ కోచ్‌లు అన్ని రోజులు తమ ఫ్యామిలీకి దూరంగా ఉండడం కష్టమని మరికొందరు అభిప్రాయం. మొత్తానికి రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియాకు కోచ్‌గా వస్తేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

చదవండి: T20 World Cup 2021: అక్షర్‌ను పక్కన పెట్టడానికి హార్దిక్‌ పాండ్యానే కారణం!

మరిన్ని వార్తలు