ధోని తర్వాత వారిద్దరే బెస్ట్‌ వికెట్‌ కీపర్లు..

26 Nov, 2020 16:28 IST|Sakshi

న్యూఢిల్లీ:   ఎంఎస్‌ ధోని తర్వాత టీమిండియా వికెట్‌ కీపర్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఎప్పట్నుంచో అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ధోని వారసుడిగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు చాలా అవకాశాలిచ్చినా అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆరంభంలో అదరగొట్టినా ఆపై నిలకడలేమి కారణంగా  జట్టులో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం  ఆపసోపాలు పడుతున్నాడు. ప్రధానంగా  కేఎల్ రాహుల్‌తో చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో పంత్‌ చాలాకాలం రిజర్వ్‌  బెంచ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో పంత్‌ చోటు దక్కించుకోవడంతో అతనిపై చాలా ఎక్కువ ఫోకస్‌ ఉంది. (తొలిసారి ఆన్‌లైన్‌ ఓటింగ్‌.. మీకు నచ్చిన క్రికెటర్‌కు ఓటేయ్యండి)

అయినప్పటికీ కీపింగ్ ప్లేస్ కోసం ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎవరు అవకాశం దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  టీ20ల్లో దూకుడుగా ఆడే సంజూ శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టిన సాహా కూడా రెగ్యులర్‌ కీపర్‌గా మారే అవకాశం ఉంది. కీపింగ్‌లో అమోఘమైన స్కిల్స్‌  ఉన్న సాహా.. బ్యాటింగ్‌ పరంగా తన సత్తా నిరూపించుకోవడంతో అతనికి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాలున్నాయి. 

అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పంత్‌, సాహాలను ప్రత్యేకంగా ప్రశంసించాడు. పీటీఐతో మాట్లాడుతూ.. రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా ఇద్దరూ అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు.  ఐపీఎల్ 2020లో రిషభ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతన్ని దాదా వెనకేసుకొచ్చాడు. ' పంత్‌  గురించి ఆందోళన వద్దు. ఐపీఎల్‌లో పంత్ తన సహజసిద్ధమైన ఆటతీరు కనబర్చలేకపోయినా.. అతనిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. కచ్చితంగా జట్టులోకి వస్తాడనే నమ్మకం ఉంది. పంత్ యువ ఆటగాడు. అతనికి సలహాలు, సూచనలు అవసరం. సాహా కూడా అత్యుత్తమ కీపరే. సాహా-పంత్‌ల మధ్య పోటీ ఉంటుంది. ప్రస్తుతం భారత  జట్టులో వారిద్దరే అత్యుత్తమ  వికెట్‌ కీపర్లు’ అని గంగూలీ తెలిపాడు. (‘కోహ్లికి కాదు.. మా బ్యాట్స్‌మన్‌కే కష్టం’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా