Ind Vs Ban: ఆలస్యమెందుకు.. ఆ షర్ట్‌ కూడా తీసెయ్‌! కోహ్లికి కోపం తెప్పించిన బంగ్లా బ్యాటర్‌ చర్యలు

24 Dec, 2022 12:55 IST|Sakshi
బంగ్లా బ్యాటర్‌ చర్యలు.. టీమిండియా ఆటగాళ్ల ఆగ్రహం(PC: Twitter)

Bangladesh vs India, 2nd Test- Virat Kohli: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ఇంకా ఏం చేస్తావో చెయ్‌! ఆలస్యమెందుకు.. ఆ షర్ట్‌ కూడా తీసెయ్‌’’ అన్నట్లు బంగ్లా బ్యాటర్‌ నజ్ముల్‌ శాంటోపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా 314 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అయితే, బ్యాటింగ్‌కు వస్తున్న సందర్భంగా బంగ్లా ఓపెనర్‌ నజ్ముల్‌ హొసేన్‌ శాంటో సమయం వృథా చేశాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న వేళ టైమ్‌ వేస్ట్‌ చేస్తూ భారత ఆటగాళ్ల ఓపికను పరీక్షించాడు.

అన్నీ చెక్‌ చేసి.. మళ్లీ
తొలుత బ్యాట్‌ మార్చుకోవాలంటూ.. తనకోసం బ్యాట్లు తెప్పించుకున్న నజ్ముల్‌ అన్నీ చెక్‌ చేసి.. ముందుగా తన వెంట తెచ్చుకున్న బ్యాట్‌తోనే బ్యాటింగ్‌కు దిగాడు. ఇక మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా షూ లేస్‌ కట్టుకుంటూ మరోసారి ఆలస్యం చేశాడు. దీంతో కోహ్లికి చిర్రెత్తుకొచ్చింది.

తన జెర్సీ విప్పుతున్నట్లుగా సైగ చేస్తూ శాంటోకు చురకలు అంటించాడు. అదే విధంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం.. బంగ్లా బ్యాటర్ల వద్దకు వెళ్లి ఏంటి లేట్‌ అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక శనివారం మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే అశ్విన్‌ తన అద్బుత బంతితో శాంటోను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో అతడు 5 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 24 పరుగులు చేశాడు. 

చదవండి: IPL 2023: సాల్ట్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే! జాక్‌పాట్‌పై టాక్సీ డ్రైవర్‌ కొడుకు హర్షం
Rishabh Pant: 6 సార్లు తృటిలో చేజారిన శతకం! అయితే ఏంటి? నాకు అదే ముఖ్యమంటూ..

మరిన్ని వార్తలు