Rohit Sharma: రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు!

18 Nov, 2021 11:11 IST|Sakshi

నిజానికి రోహిత్‌ కెప్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది... కానీ..

IND vs NZ 2021 Rare Error on Rohit Sharma Captaincy Part Says Aakash Chopra: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు వెంకటేశ్‌ అయ్యర్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్నాడు. అయితే, తుదిజట్టులోకి ఆల్‌రౌండర్‌గా ఎంపికైన అయ్యర్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ... ‘‘ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నామన్న టీమిండియా అతడిని ఆరోస్థానంలో ఆడించింది. కానీ.. తనకు బౌలింగ్‌ చేసే అవకాశం మాత్రం ఇవ్వలేదు. నిజానికి రోహిత్‌ కెప్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాంటి తన నుంచి ఇలాంటి అరుదైన తప్పిదాన్ని ఊహించలేదు. నిజంగా తను నన్ను ఆశ్చర్యపరిచాడు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

‘‘టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుని... ఫస్టాఫ్‌లో వాళ్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు.. కచ్చితంగా తన(వెంకటేశ్‌ అయ్యర్‌) చేతికి బంతిని ఇవ్వాల్సింది. కనీసం ఒకటి లేదంటే రెండు ఓవర్లు వేయించాల్సింది. ఎందుకంటే అప్పటికే చహర్‌, సిరాజ్‌ కాస్త ఇబ్బంది పడుతున్నారు’’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందన్న ఆకాశ్‌ చోప్రా.. పాత, కొత్త బంతులతో తను రాణించాడని ప్రశంసించాడు.

అశ్విన్‌, భువీ వంటి అనుభవజ్ఞులు కేవలం 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉందన్నాడు. కాగా జైపూర్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 62 పరుగులతో రాణించిన సూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక బౌలర్లలో భువీకి 2, దీపక్‌ చహర్‌కు ఒకటి, సిరాజ్‌కు ఒకటి, అశ్విన్‌ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

స్కోర్లు:
న్యూజిలాండ్‌- 164/6 (20)
ఇండియా- 166/5 (19.4)

చదవండి: Suryakumar Yadav: కోహ్లి నాకోసం త్యాగం చేశాడు... అయినా ఏ స్థానంలో వచ్చినా

>
మరిన్ని వార్తలు