వారెవ్వా హర్షల్‌ పటేల్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు

19 Nov, 2021 22:05 IST|Sakshi

Harshal Patel Best Bowling Debut T20I Match.. టీమిండియా పేసర్‌ హర్షల్‌ పటేల్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ద్వారా 94వ ఆటగాడిగా టీమిండియా తరపున టి20ల్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్‌ పటేల్‌ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. హర్షల్‌ తాను వేసిన ప్రతీ బంతి దాదాపు 140 కిమీ వేగంతో విసరడం విశేషం. అలా తన డెబ్యూ మ్యాచ్‌తోనే హర్షల్‌ అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత హర్షల్‌ పటేల్‌ తన బౌలింగ్‌ ప్రదర్శనపై స్పందించాడు.

''దేశానికి ఆడడం గర్వంగా ఉంటుంది. ఆటను ఇష్టపడే నేను.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మ్యాచ్‌కు ముందు ద్రవిడ్‌ సర్‌ నాతో మాట్లాడుతూ.. నీ ప్రిపరేషన్‌ ముగిసింది అంటే మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ ఎంజాయ్‌ చేయాలని చెప్పాడు. ద్రవిడ్‌ అన్నట్లుగానే తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేయడం సంతోషం కలిగించింది. ఐపీఎల్‌ ఫామ్‌ను ఇక్కడ కంటిన్యూ చేస్తూ డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాను. ఈ ప్రదర్శన ఎప్పటికి మరిచిపోను.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్‌ పటేల్‌ కొత్త చరిత్ర

Axar patel: అక్షర్‌ పటేల్‌.. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే

మరిన్ని వార్తలు