Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్‌ జరిగేనా?

9 Oct, 2022 10:18 IST|Sakshi

లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్‌ తలపడనుంది. సిరీస్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా టీమిండియా విజయం సాధించాలి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్‌ ఉంది.

ఆదివారం మ్యాచ్‌ జరిగే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని అక్యూవెదర్ పేర్కొంది. అదే విధంగా తేమ కూడా 72 శాతం ఉంటుంది అని అక్యూవెదర్‌ వెల్లడించింది.

కాగా లక్నో వేదికగా జరిగిన  తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఇక రెండో వన్డే కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


తుది జట్లు(అంచనా)
టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజిత్‌ పటిదార్‌, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్‌! పటిదార్‌ అరంగేట్రం!

మరిన్ని వార్తలు