అను ఇమ్మాన్యుయేల్‌కు మరో చాన్స్‌

9 Oct, 2022 10:15 IST|Sakshi

తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ గ్లామరస్‌ కథానాయకిగా ముద్ర వేసుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్‌. తెలుగులో అల్లుఅర్జున్, నాగచైతన్య వంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది. అయినా సరైన సక్సెస్‌ కోసం ఇంకా ఎదురు చూస్తునే ఉంది. ఇక తమిళంలోనూ విశాల్, శివకార్తికేయన్‌ సరసన నటించింది. ఇక్కడ కూడా సరైన గుర్తింపు కోసం ఎదురుచూసోంది. తాజాగా ఓ సూపర్‌ చాన్స్‌ ఈ అమ్మడిని వరించినట్లు తెలుస్తోంది.

విరుమాన్, పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు కార్తీ. తాజాగా దీపావళికి సర్ధార్‌ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి రాశీఖన్నా, రెజీనా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈయన నూతన చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజు మురుగన్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఇందులో బాలీవుడ్‌ నటి నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి అను ఇమ్మాన్యుయేల్‌కు ఈ అదృష్టం వరించిందని సమాచారం.

మరిన్ని వార్తలు