డేవిస్‌ కప్‌లో నార్వేతో భారత్‌ పోరు

1 Apr, 2022 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 1లో భారత్‌    తలపడే ప్రత్యర్థి ఖరారైంది. ఈ పోరులో నార్వేతో భారత ఢీకొంటుంది. గురువారం ఈ ‘డ్రా’        విడుదల చేయగా, నార్వే వేదికగానే భారత్‌ తమ ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్‌ 16–18 మధ్య డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అయితే దాదాపు అదే తేదీల్లో ఆసియా క్రీడలు కూడా జరగనుండటంతో జట్టు ఎంపిక భారత టెన్నిస్‌ సంఘానికి (ఏఐటీఏ) ఇబ్బందిగా మారనుంది. ఆసియా క్రీడల్లో సెప్టెంబర్‌ 10–14 మధ్య టెన్నిస్‌ మ్యాచ్‌ జరగనుండగా...తక్కువ వ్యవధిలో నార్వే చేరుకొని భారత్‌ ఆడటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో తేదీల్లో మార్పు చేసే విషయంపై అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌)కు ఏఐటీఏ విజ్ఞప్తి చేయనుంది. డేవిస్‌ కప్‌ చరిత్రలో భారత్, నార్వే ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడలేదు. ఆ జట్టులో వరల్డ్‌ నంబర్‌ 8 కాస్పర్‌ రూడ్‌ రూపంలో అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు.  

మరిన్ని వార్తలు