ప్రముఖ బాలీవుడ్‌ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్‌ మామ..!

22 Dec, 2021 16:29 IST|Sakshi

Kane Williamson With Manoj Bajpayee:  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, ఫ్యామిలీ మ్యాన్‌ ఫేమ్‌ మనోజ్‌ బాజ్‌పేయికి.. న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ అదిరిపోయే రేంజ్‌లో షాకిచ్చాడు. కేన్‌ మామ ఎంటి.. మనోజ్‌ బాజ్‌పేయికి షాకివ్వడమేంటి అనుకుంటున్నారు. అయితే ఈ స్టోరీ చదవండి. అమెజాన్ ప్రైమ్ వేదికగా బాలీవుడ్ సూపర్ స్టార్ మనోజ్ బాజ్‌పేయి, కివీస్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌తో ముచ్చటించాడు. ఈ ఇద్దరి మధ్య క్రికెట్‌, సినిమా, వెబ్‌ సిరీస్‌ వంటి పలు అంశాలపై సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మ్యాన్‌.. కేన్‌ మామకు పలు ప్రశ్నలు వేశాడు. దీనికి కివీస్‌ కెప్టెన్‌ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. 

సంభాషణలో భాగంగా అమెజాన్ ప్రైమ్‌లో నీకు నచ్చిన వెబ్‌ సిరీస్‌ ఏంటని మనోజ్‌ బాజ్‌పేయి..  కేన్‌ను అడిగాడు. ఇందుకు బదులుగా కేన్‌ తన "ఫ్యామిలీ మ్యాన్" పేరు చెప్తాడేమోనని బాజ్‌పేయి ఆసక్తిగా చూశాడు. కానీ కేన్.. ఫ్యామిలీ మ్యాన్‌కు షాకిస్తూ.. ‘మీర్జాపూర్’ అని చెప్పాడు. మీర్జాపూర్‌ రెండు సీజన్లను చూసానని.. మూడో పార్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బదులిచ్చాడు. కేన్‌ సమాధానంతో బాజ్‌పేయి అవాక్కయ్యాడు. అతని ముఖం మాడిపోయింది. 'బై కేన్‌' అంటూ సంభాషణను ముగించాడు. ఇందుకు  సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో విడుదల చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, పంకజ్ త్రిపాఠి,  దివ్యేందు శర్మ, అలీ ఫజల్ నటించిన మీర్జాపూర్ వెబ్‌ సిరీస్‌.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రకంపనలు సృష్టించింది. అభిమానులు మూడో సీజన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

చదవండి: ICC Rankings: రూట్‌ను వెనక్కునెట్టి టాప్‌కు చేరిన ఆసీస్‌ బ్యాటర్‌

మరిన్ని వార్తలు