కరోనా: ఆసుపత్రిలో చేరిన సచిన్‌ టెండూల్కర్‌

2 Apr, 2021 11:52 IST|Sakshi

ముంబై: క్రికెట్ దిగ్గజం.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరు రోజుల తర్వాత సచిన్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. ఈ విషయాన్నిసచిన్‌ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. "అందరికి నమస్కారం.. నేను బాగానే ఉన్నా.. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరాను. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఇంటికి తిరిగి వస్తాను. నాకోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచకప్ సాధించి ఈరోజుతో సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా భారతీయులందరికీ, నా తోటి ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు.'' అంటూ తెలిపాడు.

కాగా సచిన్‌కు మార్చి 27న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించడంతో అప్పటినుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. సచిన్‌ కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సరీస్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. సచిన్‌తో పాటు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

అయితే టీమిండియా రెండవ ప్రపంచకప్‌ సాధించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో సినీ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ సచిన్‌ ఫోటోను షేర్‌ చేస్తూ ఒక కామెంట్‌ చేశాడు. ''మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ది టీమ్‌.. అన్ని సచినే కావడం విశేషం. నిజంగా ఈరోజు ఎన్నటికి చరిత్రలో మిగిలిపోతుంది. ''అని కామెంట్‌ చేశాడు.
చదవండి: సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్‌

మరిన్ని వార్తలు