Urvashi Rautela: పంత్‌తో చెడింది.. పాక్‌ యువ పేసర్‌పై మనసు పారేసుకుంది..!

7 Sep, 2022 13:29 IST|Sakshi

Pant-Urvashi Rautela-Naseem Shah: బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ నటి ఊర్వశి రౌతేలా ఇటీవలి కాలంలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌తో కొద్ది రోజుల పాటు ప్రేమాయణం నడిపిన రౌతేలా.. తాజాగా అతనికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌కు ముందు పంత్‌-రౌతేలా సోషల్‌మీడియా వేదికగా మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని తొలుత రౌతేలానే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రౌతేలా మాట్లాడుతూ.. ఆర్‌పీ (పంత్‌ను ఉద్దేశిస్తూ) అనే ఓ సెలబ్రిటి తన కోసం 16 గంటల పాటు పడిగాపులు కాశాడని వివాదానికి తెరలేపింది. దీనికి ప్రతిగా పంత్‌ సైతం తనదైన స్టయిల్‌లో స్పందించాడు. కొంతమంది పేరు, ప్రఖ్యాతల కోసం ఎంతకైనా దిగజారుతారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తారని, ఫైనల్‌గా.. ప్లీజ్‌ అక్క, నన్ను వదిలేయ్‌ అంటూ రౌతేలాకు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చాడు. 

పంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న రౌతేలా.. పంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పంత్‌ ఓ కౌగర్‌ హంటర్‌ (తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో లైంగిక సంబంధం కోరుకునే వ్యక్తి) అని.. చోటా భయ్యా నువ్వు బ్యాట్‌ బాల్‌తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ప్రతిగా పంత్‌ మరో కౌంటరిచ్చాడు. ఎక్కువగా స్ట్రెస్‌ తీసుకోవద్దు అక్కా అంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఈ మాటల యుద్ధానికి పుల్‌స్టాప్‌ పడింది. అయితే రౌతేలా ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. 

అసలు క్రికెట్‌ అంటేనే నచ్చదు అన్న ఆమె.. ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా గ్యాలరీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలామంది పంత్‌పై ప్రేమను చంపుకోలేక రౌతేలా మ్యాచ్‌ చూసేందుకు వచ్చిందని కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ విషయం వేరున్నట్లు ఆలస్యంగా తెలిసింది. రౌతేలా మ్యాచ్‌కు వచ్చింది పంత్‌ను చూసేందుకు కాదని, పంత్‌తో చెడటంతో ఆమె పాక్‌ యువ బౌలర్‌ నసీమ్‌ షాతో ప్రేమలో  పడిందని, అతన్ని ఎంకరేజ్‌ చేసేందుకే మ్యాచ్‌కు వచ్చిందని పలు కథనాల ద్వారా తెలిసింది. 

ఈ విషయాన్ని రౌతేలా కూడా పరోక్షంగా అంగీకరించిందని సమాచారం. నషీమ్‌ షా, తన ఫోటోలను కలిపి ఓ అభిమాని ఎడిట్‌ చేసిన వీడియో రీల్‌ను రౌతేలా తన ఇన్ట్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేయడంతో సదరు కథనాల్లో నిజం లేకపోలేదని క్రికెట్‌ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన రీల్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అటు భారత అభిమానులే కాకుండా పాక్‌ ఫ్యాన్స్‌ సైతం రౌతేలాను ఆటాడుకుంటున్నారు. పంత్‌ను భ్రష్ఠు పట్టించావు.. ఇప్పుడు మా వాడిని సంక నాకిద్దామని వచ్చావా అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రయాంగులర్‌ లవ్‌ స్టోరీ ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.  

  
చదవండి: క్రికెట్‌ నచ్చదంటూనే స్టేడియంలో ప్రత్యక్షమైన బాలీవుడ్‌ బ్యూటీ!

మరిన్ని వార్తలు