అందుబాటులో అవసరమైన యూరియా

27 Jul, 2020 04:15 IST|Sakshi

వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతాంగ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్ని రకాల ఎరువులు 22.30 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, దీన్ని దశలవారీగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ‘యూరియా లాక్‌ ’శీర్షికన ఆదివారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చారు.

జూలై నెల కోటాను కేంద్రం సకాలంలో సరఫరా చేయకపోవడంతో వెంటనే సీఎం కేసీఆర్‌ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రితో మాట్లాడారని, తాను కూడా కేంద్రమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీంతో కేంద్రం వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందని, ఈ నెలలో 2.05 లక్షల మెట్రిక్‌ టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని, మిగిలిన యూరియాను ఈ నెలాఖరుకల్లా ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈరోజుకు రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, 

మరిన్ని వార్తలు