ఇస్కాన్‌ సేవలు అభినందనీయం

26 Dec, 2022 04:13 IST|Sakshi
హోమంలో పాల్గొన్న  గవర్నర్‌ తమిళిసై  

గవర్నర్‌ తమిళిసై  

మేడ్చల్‌: ఇస్కాన్‌ దేశ విదేశాల్లో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై పేర్కొన్నారు. మండలంలోని డబీల్‌పూర్‌ ఇస్కాన్‌ ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాసుదర్శన నారసింహ హోమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్‌ గా కాకుండా సామాన్య భక్తురాలిగా వచ్చానని మేడ్చల్‌ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అనందంగా ఉందన్నారు. ఇస్కాన్‌ సంస్థ ప్రజల కోసం ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.  

మంత్రి మల్లారెడ్డి పూజలు.. 
కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొ ని పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ మధ్య ప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్‌ నాయకుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు