24 నుంచి గ్రాండ్‌ నర్సరీ మేళా:  హరీశ్‌రావు

20 Feb, 2022 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రాండ్‌ నర్సరీ మేళాకు నెక్లెస్‌ రోడ్‌ గ్రౌండ్స్‌ ముస్తాబవుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఈ మేళాకు సంబంధించిన బ్రోచర్‌ను వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు శనివారం మిని స్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. 5 రోజుల పాటు జరిగే ఈ మేళాలో మొక్కలు, మొక్కల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు, అగ్రి కల్చర్‌ లో ఎనర్జీ సేవింగ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్‌ ఇండస్ట్రీ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.

టెర్రస్‌ గార్డెనింగ్, వర్టికల్‌ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్‌ సిస్టమ్‌ వంటి నూతన టెక్నాలజీని ప్రదర్శించనున్నారు. 120కు పైగా నర్సరీ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. మెడిసినల్‌ ప్లాంట్స్‌ కిచెన్, అవుట్‌ డోర్, ఎక్సోటిక్, బల్బ్, సీడ్, సీడ్‌ లింక్స్, ఇండోర్, ఆడినియం, బోన్సా య్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్‌ ప్లాంట్స్‌ అం దుబాటులో ఉంటాయి. డార్జిలింగ్, కోల్‌కతా, ఢిల్లీ, హరియాణా, ముంబై, బెంగళూరు, పుణే, షిర్డి, చెన్నై, తెలంగాణ, ఆంధ్ర ప్రాం తాల ప్లాంట్స్‌ ప్రదర్శిస్తారు. నెక్లెస్‌ రోడ్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. రూ. 50 నుంచి రూ.3 లక్షల వరకు మొక్కలు లభ్యమవుతాయని మేళా ఇన్‌చార్జి ఖలీద్‌ అహ్మ ద్‌ తెలిపారు. మేళాను మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు