ఆన్‌లైన్‌లో డిగ్రీ పరీక్షలు నిర్వహించలేరా..

10 Sep, 2020 14:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కరోనా వైరస్‌ కారణంగా హాస్టల్స్‌ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్‌ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని హైకోర్టు అడిగింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని అన్నారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది. (కరోనా విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు)

మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు మొదలవుతాయి. అదేవిధంగా ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్‌, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా