పర్యాటకంలో ప్రైవేటు భాగస్వామ్యం కావాలి 

20 Sep, 2022 02:12 IST|Sakshi

రాష్ట్రాల పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో కిషన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: దేశ పర్యాట క రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం కూడా అవసరమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురైన పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించే ఏకైక రంగం పర్యాటకమేనని చెప్పారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు రెండో రోజున కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోందని.. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పో టీ అత్యంత అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగే గిరిజన పండుగలు, వినాయక చవితి ఉత్సవాలు, బతుకమ్మ, విజయదశమి, సమ్మక్క–సారలమ్మ, కుంభమేళా వంటి జాతరలను ఘనంగా నిర్వహించడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వగలమన్నారు. 

మరిన్ని వార్తలు