వాగులో కొట్టుకుపోయిన లారీ

15 Aug, 2020 14:01 IST|Sakshi

లారీ డ్రైవర్‌ గల్లంతు

సాక్షి, సిద్ధిపేట: వాగులో లారీ కొట్టుకుపోయిన ఘటన కోహెడ మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వరదలో చిక్కుకున్న లారీ డ్రైవర్‌ శంకర్‌ గల్లంతయ్యారు. శంకర్‌ను కాపాడే యత్నంలో గజ ఈతగాళ్లు తాడును అతనికి అందివ్వగా.. తాడును విడిచిపెట్టడంతో వాగులో కొట్టుకుపోయారు. ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. శంకర్‌ ఆచూకీ దొరకక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్, ఆర్డీవోలను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రెస్క్యూ బృందం శంకర్‌ ఆచూకీ కోసం హెలికాఫ్టర్‌ ద్వారా గాలిస్తున్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ రఘు, ఎస్ఐ రాజా కుమార్, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరంగల్, కరీంనగర్ సిద్దిపేట నుండి గజ ఈతగాళ్లను  రప్పించి ప్రయత్నాలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు