చిరస్మరణీయుడు కాళోజీ

10 Sep, 2023 02:09 IST|Sakshi

ప్రముఖకవి జయరాజ్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

హాజరైన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్‌): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 109వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఎౖMð్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ఈ ప్రాంత మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. 

కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అందులో కాళోజీ ఒకరని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి జయరాజ్‌ కు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ ముదిరాజ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమ ణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దీపికారెడ్డి, ఎం.శ్రీదేవి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు