సడన్‌ బ్రేక్‌.. ఒకదాని వెనుక మరోటి ఢీ..  వరుసగా 9 వాహనాలు ధ్వంసం

22 Aug, 2022 15:24 IST|Sakshi
ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు

సాక్షి, షాద్‌నగర్‌: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణ శివారులోని బైపాస్‌ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్‌నగర్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్‌ ముందు వెళ్తున్న బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి సడన్‌గా బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్‌ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్‌: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?)

ఓవర్‌టేక్‌ చేయబోయి.. అదుపు తప్పిన బైక్‌.. వ్యక్తి దుర్మరణం 
చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి బైక్‌పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్‌(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్‌పై ఆలూరు నుంచి గేట్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు.


మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్‌టేక్‌ చేయబోతుడంగా బైక్‌ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్‌: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ)

మరిన్ని వార్తలు