బాలికపై అత్యాచారం: అధైర్య పడొద్దు..అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్ 

3 Nov, 2021 13:43 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్‌లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.
చదవండి: బాలికపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ

మరిన్ని వార్తలు