ఆ 68 మంది రైతులపై అనర్హత వేటు 

2 Jul, 2021 08:32 IST|Sakshi
పసుపు రైతులు(ఫైల్‌)

2019 ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించిన లెక్కలు సమర్పించకపోవడమే కారణం 

మోర్తాడ్‌ (బాల్కొండ): పసుపు బోర్డు ఏర్పాటు సాధనే లక్ష్యంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలు చేసి దేశ ప్రజలను ఆకర్షించిన రైతు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. 2019 సాధారణ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులకు సంబంధించిన లెక్కలను ఎన్నికల అధికారికి పోలింగ్‌ ముగిసిన నెల రోజులలోపు అందచేయాల్సి ఉంది. అయితే ఆ 68 మంది అభ్యర్థులు ఎన్నికల అధికారికి తమ ప్రచార లెక్కలకు సంబంధించిన నివేదికలను సమర్పించలేదని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించబడిన అభ్యర్థులు మూడేళ్ల వరకు పార్లమెంట్, అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఈ మేరకు రెండు రోజుల కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయెల్‌ ఉత్తర్వులను జారీ చేశారు. 

మరిన్ని వార్తలు