జూమ్‌ యాప్‌లో సీఎల్పీ సమావేశం

9 Aug, 2020 15:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భట్టి విక్రమార్క నేతృత్వంలో జూమ్‌ యాప్‌లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరోనా నిర్ధారణ పరీక్షలు, వైరస్‌ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై కాంగ్రెస్‌ నేతలు చర్చించారు. సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘‘జగన్న.. గడ్డాలు, మీసాలు బాగా పెంచడంతో మాస్కు కూడా పెట్టాల్సిన పనిలేకుండా పోయిందని రాజగోపాల్‌ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని కరోనా టెస్టు చేయించుకోమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు