సామాజిక సంతోషం

11 Nov, 2023 00:36 IST|Sakshi
ప్రజా ప్రతినిధులకు అపూర్వ స్వాగతం

పార్వతీపురం టౌన్‌/పార్వతీపురం:

పార్వతీపురంలో సామాజిక సాధికార యాత్ర శుక్రవారం సంబరంగా సాగింది. పల్లె, పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన మేలు ను పాలకులు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్‌ అంటూ నినదించారు. పేదలబతుకులు మారాయంటూ గట్టిగా చెప్పారు. పిల్లలకు విద్యావకాశాలు అందుబాటులోకి వచ్చాంటూ సంతోషం వ్యక్తంచేశారు. పథకాల లబ్ధి అంతా ఖాతాలకే చేరుతోందని స్పష్టంచేశారు. సామాజిక సాధికారత చేకూరిందన్నారు. సీతానగరం మండలం లచ్చయ్యపేటలో మొదలైన సామాజిక సాధికార బస్సుయాత్ర పార్వతీపురం పట్టణంలో ప్రవేశించగానే బైకులతో స్వాగతం పలికారు. నృత్యప్రదర్శనలతో ఆహ్వానం పలికారు. ప్రజల హర్షధ్వానాలు, స్వాగత నినాదాల మధ్య బస్సుయాత్ర ముందుకు సాగింది. పాత బస్టాండ్‌ కూడలి వద్ద నిర్వహించిన సభావేదిక వద్ద నుంచి ప్రధాన రోడ్డులో సూమారు రెండు కిలోమీటర్ల వరకు జనాభిమానం పోటెత్తింది. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో కళా బృందాలు ఆటపాటలతో అలరించాయి.

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం

సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలుచేస్తోందన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.1200 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గెడ్డలుప్పి వంతెన, అంతరాష్ట్ర రాష్ట్ర రహదారి పరిధిలోని సీతానగరం బ్రిడ్జి, నారాయణపురం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేసిందన్నారు. నియోజకవర్గంలో 11,784 మందికి సొంతింటి కలను సాకారం చేసిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలునాయుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, నవరత్నాల అమలు కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకురురెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కంబాల జోగులు, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమావతి, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌ లు నెక్కల నాయుడుబాబు, మామిడి శ్రీకాంత్‌, డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి, జీసీసీ చైర్మన్‌ శోభాస్వాతిరాణి, పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరీ, మూడు మండలాల ఎంపీపీలు మజ్జి శోభారాణి, బలగ రవణమ్మ, గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ సభ్యులు బి.రమణమ్మ, మామిడి బాబ్జి, ఎ.రవికుమార్‌, పార్టీ మండలాధ్యక్షులు బొమ్మి రమేష్‌, బొంగు చిట్టిరాజు, మురళి, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ,పార్టీ శ్రేణులు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

అణగారిన వర్గాలకు రాజ్యాధికారం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి కార్పొరేట్లకు దీటుగా విద్యను అందిస్తున్నారన్నారు. అభివృద్ధిని వక్రీకరించి టీడీపీ నేత చంద్రబాబునాయుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జోగారావు అందరిలో కలిసిన వ్యక్తి అని, ప్రజా సమస్యలు తెలిసిన వాడని, సమస్యల పరిష్కారానికి కృషిచేసేవాడని, ఆయనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు