రాష్ట్రస్థాయి సైన్స్‌ పోటీలకు కంచరాం విద్యార్థినులు | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సైన్స్‌ పోటీలకు కంచరాం విద్యార్థినులు

Published Sat, Nov 11 2023 12:36 AM

- - Sakshi

రాజాం సిటీ: రాష్ట్రస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనకు మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినుల ప్రాజెక్ట్‌ ఎంపికై ందని భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు పండూరు వేణుగోపాల్‌ శుక్రవారం తెలిపారు. విజయనగరంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థినులు కరణం వరలక్ష్మి, పెనుబోతు సౌజన్య ప్రదర్శించిన ‘సంప్రదాయ పద్ధతిలో చిరుధాన్యాల పొడి’ అనే ప్రాజెక్టు ఎంపికై ందని చెప్పారు. ఈ నెల 29, 30 తేదీలలో గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి ప్రదర్శనలో తమ పాఠశాల విద్యార్థినులు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినుల ప్రతిభపట్ల హెచ్‌ఎం వీవీ వసంతకుమార్‌తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.

కాగితాపల్లి విద్యార్థులు కూడా..

రేగిడి: మండలంలోని కాగితాపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి తయారుచేసిన ప్రాజెక్ట్‌ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై ంది. ఈ విషయాన్ని ప్రాజెక్ట్‌ గైడెన్స్‌ ఉపాధ్యాయుడు గొర్లె రమేష్‌ శుక్రవారం తెలిపారు. ఈనెల 9న విజయనగరంలో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఎనిమిదవ తరగతి విద్యార్థి డి.తేజేశ్వరరావు ప్రదర్శించిన డెంగీ నివారణలో మొక్కల ప్రమేయమనే ప్రాజెక్ట్‌ ప్రథమస్థానం సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ తయారుచేసిన విద్యార్థిని పాఠశాల హెచ్‌ఎం.ఆర్‌.సుధాకర్‌, ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య తదితరులు అభినందించారు.

రాష్ట్రస్థాయికి ఎంపికై న మామిడిపల్లి విద్యార్థులు

సాలూరు: మండలంలోని మామిడిపల్లి జెడ్పీహెచ్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మూఢనమ్మకాలపై ప్రత్యేక నాటికను మామిడిపల్లి విద్యార్థులు గంగవంశం చరిష్మ, గిరీష్‌, శ్రీజ, సుదీప్‌, రోహిత్‌,ఉదయశ్రీలు ప్రదర్శించి ప్రతిభ కనబరిచారు, ఈ మేరకు ఈ బృందాన్ని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా న్యాయనిర్ణేతలు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

రేగిడి: విద్యార్థి తేజేశ్వరరావును అభినందిస్తున్న హెచ్‌ఎం తదితరులు
1/2

రేగిడి: విద్యార్థి తేజేశ్వరరావును అభినందిస్తున్న హెచ్‌ఎం తదితరులు

సాలూరు: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న 
విద్యార్థులను అభినందిస్తున్న డీఈఓ
2/2

సాలూరు: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను అభినందిస్తున్న డీఈఓ

Advertisement
Advertisement