బంగారం చోరీకేసులో నిందితుల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

బంగారం చోరీకేసులో నిందితుల అరెస్ట్‌

Published Sat, Nov 11 2023 12:36 AM

స్వాఽధీనం చేసుకున్న బంగారం ఆభరణాలు  - Sakshi

జామి: బంగారం ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ అరెస్ట్‌ వివరాలిలా ఉన్నాయి. జామి మండలంలోని భీమసింగి గ్రామంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో కంది గురునాయుడు ఇంట్లో బంగారం చోరీకి గురైంది. ఈ ఘటనలో పోలీసులు విచారణ చేపట్టి నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామానికి చెందిన అవనాపు అప్పలస్వామి ఉరఫ్‌ బిల్లా, బుగత రాజేష్‌ ఉరఫ్‌ చింతపిక్కలోడు అనే ఇద్దరు నిందితులను జామి ఇన్‌చార్జ్‌ ఎస్సై లోవరాజు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్‌ రిమాండ్‌ నిమిత్తం ఎస్‌.కోట కోర్టుకు తరలించినట్లు ఇన్‌చార్జ్‌ ఎస్సై చెప్పారు.

లాంగ్‌జంప్‌లో గోల్డ్‌మెడల్‌

విజయనగరం: జాతీయస్థాయిలో జరిగిన లాంగ్‌జంప్‌ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం జి.లక్ష్మి సత్తా చాటింది. ఈనెల7 నుంచి 10వ తేదీ వరకు చైన్నెలోని కోయంబత్తూర్‌లో జరిగిన జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో లాంగ్‌జంప్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించి గోల్డ్‌మెడల్‌ సాధించింది. 6 మీటర్ల పొడవు జంప్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతిని చాటిచెప్పింది. ఎస్‌కోటకు చెందిన లక్ష్మి విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో కోచ్‌ సతీష్‌ వద్ద శిక్షణ పొందుతోంది. జూనియర్స్‌ విభాగంలో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించిన లక్ష్మిని సెట్విజ్‌ సీఈఓ బి.రామగోపాల్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందించారు.

జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ 
పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన లక్ష్మి
1/1

జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన లక్ష్మి

Advertisement
Advertisement