‘వెలుగుల’ పండుగ

12 Nov, 2023 00:50 IST|Sakshi
టపాసులు కొనుగోలు చేస్తున్న జనం

వనపర్తిటౌన్‌: జిల్లాలో ఆదివారం వెలుగుల పండుగ దీపావళి ఘనంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శనివారం జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కొనుగోలుదారుల సందడి కనిపించింది. జిల్లాకేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యావసర సరుకులు, దుస్తులు, పూలు, పండ్లు, పూజాసామగ్రి, దీపపు ప్రమీదలు, మామిడాకులు, పూజా సామగ్రితోపాటు బాణసంచా కొనుగోలుకు జనం అధికసంఖ్యలో తరలిరావడంతో దుకాణాలు, రహదారులు కిక్కిరిసి కనిపించాయి. పట్టణంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో బాణసంచా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. రూ. ఒకటి నుంచి రూ.4 వేల వరకు విలువగల టపాసులు అందుబాటులో ఉన్నట్లు దుకాణదారులు తెలిపారు. ప్రమాదాలు జరిగితే నివారించేందుకు సెఫ్టీ సిలిండర్లు, నీటిని అందుబాటులో ఉంచారు. ఆదివారం విక్రయాల జోరు మరింత పెరగనుందని.. ఫైరింజన్‌ అందుబాటులో ఉంచాలని దుకాణదారులు కోరుతున్నారు.

బంతి పూలు, ప్రమీదలు,

మామిడాకులకు భలే గిరాకీ

కొనుగోలుదారులతో కిక్కిరిసిన మార్కెట్లు

పట్టణాల్లో వెలిసిన బాణసంచా

దుకాణాలు

మరిన్ని వార్తలు