నిర్మించినా.. నిరుపయోగమే! | Sakshi
Sakshi News home page

నిర్మించినా.. నిరుపయోగమే!

Published Sun, Nov 12 2023 12:48 AM

గోపాల్‌పేటలోని చేపల మార్కెట్‌లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు 
 - Sakshi

వినియోగంలోకి తేవాలి..

మండల కేంద్రంలో చేపల మార్కెట్‌ ఉన్నా.. విక్రయాలు కొనసాగడం లేదు. చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది.. తక్కువ ధరలో వస్తాయి కానీ ఇక్కడ అమ్మడం లేదు. సంత రోజుల్లో పక్క ఊర్ల నుంచి వచ్చి విక్రయాలు జరుపుతున్నాయి. కనీసం వారాంతపు సంత రోజుల్లోనైనా మార్కెట్‌లో చేపలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.

– సంగనమోని వెంకటయ్య, గోపాల్‌పేట

గోపాల్‌పేట: మత్స్యకారుల జీవనోపాధికి, ప్రజలకు నాణ్యమైన చేపల మాంసం అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. వాటిని గ్రామాల్లోని చెరువుల్లో వదిలి అవి పెరిగిన తర్వాత మత్స్యకారులు విక్రయించి జీవనోపాధి పొందాలన్నది ప్రభుత్వ ఉద్ధేశం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలోని గోపాల్‌పేట, ఆత్మకూరులో రూ.10 లక్షలతో చేపల మార్కెట్లు నిర్మించారు. ప్రారంభం నుంచి ఆత్మకూరులో చేపల విక్రయాలు కొనసాగుతున్నా.. గోపాల్‌పేటలో మాత్రం వినియోగంలో లేక ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. అదేవిధంగా గ్రామాల్లో సైతం మార్కెట్లు ఏర్పాటు చేసి గ్రామీణులకు చేప మాంసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

పెబ్బేరులోని చేపల మార్కెట్‌ గతంలో ఏర్పాటు చేసిందే. అక్కడ విక్రయాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కానీ పెబ్బేరు పురపాలికలో విలీనం చేసిన చెలిమిల్ల మత్స్యకారులు కొల్లాపూర్‌కు వెళ్లే దారిలో రోడ్డుపై విక్రయాలు కొనసాగిస్తున్నారు. గ్రామంలోనూ చేపల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా నేటికీ ఫలి తం లేదని.. ఇప్పటికై నా స్పందించి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలా గే జిల్లాకేంద్రంలో 15 ఏళ్ల కిందటే మార్కెట్‌ ఏర్పా టు చేశారు. కానీ పట్టణంలో లోనికి ఉండటంతో విక్రయాలు ఆశించిన మేర సాగకపోవడంతో మారెమ్మకుంట, మర్రికుంట, పొట్టి శ్రీరాములు చౌరస్తాల్లో విక్రయిస్తున్నారు. ఆత్మకూరులో ఎనిమిదేళ్ల కిందట చేపల మార్కెట్‌ నిర్మించి అక్కడే

విక్రయించేలా చూస్తాం..

జిల్లాలో నాలుగు చేపల మార్కెట్లు ఉన్నాయి. మూడు మార్కెట్లలో విక్రయాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. గోపాల్‌పేట మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని పలుమార్లు మత్స్యకారులతో మాట్లాడాం. మార్కెట్‌లోనే విక్రయాలు జరపాలని చెప్పినా వినడం లేదు. మరోసారి మాట్లాడి చేపలు విక్రయించేలా చర్యలు తీసుకుంటాం. – రహమాన్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

విక్రయాలు జరుపుతున్నారు. గోపాల్‌పేటలో 2017 ప్రారంభించినా.. విక్రయాలు అంతంత మాత్రంగానే కొనసాగుతుండటంతో పిచ్చి మొక్కలు మొలిచాయి. అప్పుడప్పుడు శుభ్రం చేయిస్తున్నారే తప్పా విక్రయాలు జరపడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో మినీ చేపల మార్కెట్లు ఏర్పాటు చేసి వారాంతపు సంతల్లో అయినా విక్రయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పిచ్చి మొక్కలతో నిండిన

గోపాల్‌పేట చేపల మార్కెట్‌

రూ.పది లక్షలతో నిర్మాణం

వినియోగంలోకి తీసుకురావాలని

కోరుతున్న ప్రజలు

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement