లాక్‌డౌన్‌: అక్క, తమ్ముళ్లను 13ఏళ్ల తర్వాత కలిపింది

13 Apr, 2020 20:48 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: లాక్ డౌన్ నేపథ్యంలో రాజమహేంద్రవరం బీసీ బాయ్స్ హాస్టల్‌ను ప్రస్తుతం వలస కూలీలు, నిరాశ్రయులకు వసతి గృహంగా మార్చారు. అందులో ఆశ్రయం పొందుతున్న కేరళకు చెందిన రామేశం (41) అనే వ్యక్తి 2003 లో స్కిజోఫ్రీనియా అనే వ్యాధితో బాధపడుతూ ఇంటి నుండి తప్పిపోయి రాజమహేంద్రవరం చేరుకున్నాడు.

అయితే ఆదివారం జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం వైద్యులు వలస కార్మికులు, నిరాశ్రయులు ఉన్న వసతి గృహాలను సందర్శించి వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందులో భాగంగా వారు రామేశంతో మాట్లాడగా ఆయన చెప్పిన వివరాల ఆధారంగా కేరళలోని త్రుసూర్ మానసిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా బాధితుడి అక్క వీడియో కాల్‌లో మాట్లాడి ఆనందభాష్పాలతో కన్నీటి పర్యంతమైంది. 13 సంవత్సరాల  క్రితం  దూరమైన అక్క తమ్ముళ్లను లాక్ డౌన్ కలపడం విశేషం.

>
మరిన్ని వార్తలు