ప్రజాభిప్రాయ సేకరణ జరపండి

4 Apr, 2020 04:42 IST|Sakshi

కరకట్టలపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలకు ఏపీ సర్కారు లేఖ

శబరి, సీలేరు నదులపై కరకట్టలు నిర్మిస్తామని వెల్లడి

ప్రజాభిప్రాయ సేకరణ చేయకుంటే.. సుప్రీం కోర్టుకు నివేదిస్తామని స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ జల విస్తరణ ప్రాంతానికి ఆవల శబరి, సీలేరు నదులపై కరక ట్టలు నిర్మించడంపై ప్రజాభిప్రాయ సేకరణ నిమి త్తం గ్రామసభలు నిర్వహించాలని ఒడిశా, ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్‌ మరోసారి లేఖ రాసింది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు కర కట్టలు నిర్మిస్తామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌ నుంచి 5 టీఎంసీలు ఒడిశా, 1.5 టీఎంసీలు ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాలు వినియోగించుకునే వెసులు బాటు కూడా కల్పిస్తున్నామని తేల్చిచెప్పింది. ప్రజాభి ప్రాయ సేకరణకు సహకరించకపోతే.. అదే విష యాన్ని సుప్రీం కోర్టుకు నివేదిస్తామని స్పష్టీక రించింది. 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని... మూడు రాష్ట్రాలకు ఉపయోగకరమైన ప్రాజెక్ట్‌ను సకాలం లో పూర్తి చేయడానికి సహకరించాలని కోరింది. 

గతంలోనూ లేఖలు రాసినా..
► ఏప్రిల్‌ 2, 1980న గోదావరి ట్రిబ్యునల్‌ జారీ చేసిన అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ జల విస్తరణ ప్రాంతానికి ఆవల.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని శబరి, సీలేరు నదులపై కరకట్టలు నిర్మించాలి.
► ఇందుకు సంబంధించి సమీప గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి, నివేదిక ఇవ్వాలని 2006లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలకు ఏపీ లేఖలు రాసింది. ఇప్పటివరకు అనేక మార్లు లేఖలు పంపినా ఆ రెండు ప్రభుత్వాలు స్పందించడం లేదు.

కేంద్ర నిపుణుల కమిటీ సూచనల మేరకు..
పోలవరం ప్రాజెక్ట్‌ పనులను గతేడాది డిసెం బర్‌ 27 నుంచి 31 వరకూ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హెచ్‌కే హల్దార్‌ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల కమిటీ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. దీన్ని పరిశీలించిన కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రజాభి ప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహిం చాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు మరోసారి లేఖ రాయాలని ఏపీ సర్కార్‌కు సూచించింది. దాం తో తాజాగా ఆ రెండు రాష్ట్రాల ప్రభు త్వాలకు ఏపీ సర్కార్‌ లేఖలు పంపించింది. 

>
మరిన్ని వార్తలు