‘చంద్రబాబు విమర్శలు అర్థరహితం’

1 May, 2020 17:24 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకి అండగా వుంటున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కరోనాపై పోరుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎమ్మెల్యే మధుసూధన్‌ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుదూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలన చేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ నెల వ్యవధిలో మూడుసార్లు రేషన్ సరుకులు, వెయ్యి రూపాయలు సాయం చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌ అని కొనియాడారు. ఒక పక్క కరోనాను కట్టడి చేస్తూనే డ్వాక్రా మహిళలుకు సున్నా వడ్డీ రుణాలు, జగనన్న విద్యా దీవెన, ఫించన్లు వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి  చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. (గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు)

అనంతపురం : కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. కరోనా పరీక్షల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోందన్నారు. పేద కుటుంబాలకు ఉచిత రేషన్, వెయ్యి నగదు అందిస్తున్న సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. (వైరల్‌ వీడియా షేర్‌ చేసిన ప్రధాని మోదీ )

ఆ హీరో అంటే చాలా ఇష్టం: విజయ్‌ దేవరకొండ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు