21న తూర్పుగోదావరికి సీఎం జగన్‌

26 Oct, 2019 09:09 IST|Sakshi

సాక్షి , రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెలలో జిల్లాలో పర్యటించనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసి గాలికొదిలేసిన జీఎస్‌పీసీ (గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌) పరిహారాన్ని బాధిత మత్స్యకారులకు అందజేసేందుకు ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో ఆమోదించిన సంగతి తెలిసిందే. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని సుమారు 17,550 మంది మత్స్యకారులకు ఏడు నెలల కాలానికి పరిహారం రూ.80 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ కృషి ఫలించడంతో ఆ పరిహారాన్ని ముమ్మిడివరంలోనే సీఎం చేతులు మీదుగా పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం ముమ్మిడివరం వచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదించిన క్రమంలో వచ్చే నెల 21న ముహూర్తంగా నిర్ణయించారు.

పశువుల్లంకలో వంతెనను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ తదితరులు 

పరిహారం పంపిణీతోపాటు అదే నియోజకవర్గం ఐ.పోలవరం మండలంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.35 కోట్లతో శంకుస్థాపన చేయగా పూర్తయిన పశువుల్లంక–సలాదివారిపాలెం వంతెనను  కూడా సీఎంతో ప్రారంభింపజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో  కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ శుక్రవారం నిర్మాణం పూర్తయిన వంతెనను, పరిహారం పంపిణీ కోసం ఏర్పాటు చేసే సభకు అనువైన  మురమళ్ల శరభయ్య చెరువు సమీపంలో ఉన్న ఖాళీ స్థలం, వారధికి సమీపంలో ఖాళీ స్థలాలు, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలు పరిశీలించారు. ముమ్మిడివరం మండలం కొమానపల్లి ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి 21న పర్యటన దాదాపు ఖాయమైందని కార్యక్రమం ఎలా నిర్వహించాలనేది మంత్రులు, ప్రజాప్రతినిధులు త్వరలో నిర్ణయిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆనంద దీపాలు వెలగాలి: సీఎం జగన్‌

గుంటూరులో మంత్రుల పర్యటన

వీఆర్వోపై టీడీపీ కార్యకర్త దాడి, బండబూతులు..

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ దీపావళి సందేశం

పవన్‌.. టీడీపీ తొత్తులా వ్యవహరించకు..

ధర్మాడి సత్యంకు డీఐజీ ప్రశంసలు 

ఆడుకోవడానికి వచ్చేశాడు... 

‘కంటి వెలుగు’లో... రాష్ట్రంలోనే నెం.1 

ఎంపీ గారూ.. రూ.12 కోట్లకు లెక్క చెప్పగలరా? 

చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్‌

ఆర్టీసీ బస్సు కలకలం

విందుకోసం స్కూళ్ల మూత..

చిట్‌ఫండ్‌ మోసగాళ్లకు శిక్ష పడాల్సిందే 

విదేశీ పక్షులొచ్చె.. సందడి తెచ్చె

బాబుతో లాలూచీ.. జగన్‌తో పేచీ!

విత్తన భాండాగారానికి ‘బహుళజాతి’ దెబ్బ

ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం

ఎంపీ గల్లా.. ఎమ్మెల్యేలు గద్దె, నిమ్మలకు హైకోర్టు నోటీసులు

జగనన్న పాలన చూసి బాబు వెన్నులో వణుకు 

ఎక్కడివాళ్లు అక్కడే 

సీఎం ఆదేశాలు తక్షణమే అమలు

కాపుసారాపై మెరుపు దాడులు!

విద్యార్థి చేయి విరగ్గొట్టిన ‘శ్రీచైతన్య’ టీచర్‌ 

గనులశాఖ మెమో అమలు నిలిపివేత

పోలవరానికి రూ.3 వేల కోట్లు!

నైపుణ్యాభివృద్ధిరస్తు

సచివాలయాల్లోనూ సూపర్‌ ‘రివర్స్‌’

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

దర్శక నిర్మాతలకు షాక్‌ ఇచ్చిన రష్మిక!

లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి

స్టార్‌ ప్రొడ్యూసర్‌కు రూ. 5 కోట్లు టోకరా!

చిన్న గ్యాప్‌ తర్వాత...