డాక్టర్‌ సుధాకర్‌ పదే పదే న్యూసెన్స్‌ చేస్తున్నారు

12 Jun, 2020 09:12 IST|Sakshi

స్టేషన్‌కు తరుచూ రావడంపై సీపీ ఆర్కే మీనా ఆగ్రహం

ఏదైనా చెప్పాలనుకుంటే సీబీఐకి చెప్పుకోవాలని సూచన  

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల సస్పెన్షన్‌కి గురైన వివాదాస్పద వైద్యుడు సుధాకర్‌ పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వస్తూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా మండిపడ్డారు. సుధాకర్‌పై నమోదైన కేసును హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐకి అప్పగించారని, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గురువారం విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన కమిషనర్‌ దివ్య హత్యకేసు విచారణను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తనను అరెస్ట్‌ చేసినప్పుడు కారులో ఉండిపోయిన ఏటీఎం కార్డులు కావాలంటూ డాక్టర్‌ సుధాకర్‌ పోలీసుల వద్దకు రావడంపై మీడియా సీపీని ప్రశ్నించగా.. డాక్టర్‌ సుధాకర్‌ తరుచూ పోలీస్‌స్టేషన్‌కు రావడం వెనక ఓ రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 

సీబీఐ దర్యాప్తు చేస్తుండగా స్టేషన్‌కు రావడం ఎందుకు?
డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా ఆయన పోలీస్‌స్టేషన్‌కు రావడం ఎందుకని సీపీ మీనా ప్రశ్నించారు. ఆయన సీబీఐ వద్దకు ఎందుకు వెళ్లడం లేదంటూ  అసహనం వ్యక్తంచేశారు. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని సుధాకర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డిమాండ్‌చేస్తున్నారని..  ‘పోలీసులు పోయిన ఉద్యోగాలు ఇస్తారా? ఏమైనా అడగాలనుకుంటే ప్రభుత్వాన్ని అడగాలి’ అని అన్నారు.

మరిన్ని వార్తలు