చెట్టుకు నీడ కరువవుతోంది..!

20 May, 2019 09:34 IST|Sakshi
ఎండిపోయిన మొక్కలు 

సాక్షి, దేవరపల్లి : మొన్నటి వరకు రకరకాల మొక్కలతో పచ్చదనంతో కళకళలాడిన ఉద్యానవనం నేడు ఎండిపోయి వెలవెలబోతుంది. లక్షల రూపాయల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాళీగా ఉన్న స్థలంలో రెండు సంవత్సరాల క్రితం రకరకాల మొక్కలు నాటి ఉద్యానవనం తయారు తయారు చేశారు. పచ్చని మొక్కలు, సువాసన వెదజల్లే మొక్కలతో ఉద్యానవనం (గార్డెన్‌)  ్ఛహ్లాదకరంగా తయారు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ప్రముఖ దాత అంబటి శ్రీనివాసరావు తన సొంత నిధులు సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఉధ్యావనవనం ఏర్పాటు చేశారు.

అప్పటి వరకు ముళ్లపొదలు, మురుగునీటి గుంటలతో ఉన్న ఆసుపత్రి ప్రాంగణం సుందరంగా తయారు చేశారు. అయితే ఇటీవల గార్డెన్‌ ఆలనాపాలనా లేక పచ్చదనం తగ్గింది. వేసవి ఎండల తీవ్రతకు ఉద్యావనంలోని మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. మొక్కలకు నీరులేక ఎండిపోయి వెలవెలబోతున్నాయి. చక్కని ఉద్యానవనం నిలువునా ఎండిపోవడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు నిరూత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలకు ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు