ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్‌

13 Feb, 2020 18:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ చేస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్‌ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ప్రోరోగ్‌ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్‌ చేస్తే ఆర్డినెన్స్‌ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక)

ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు..
తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్‌ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్‌ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్‌ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు)

చదవండి:
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా