-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలను రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ "ప్రోరోగ్" చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉభయ సభల 6వ సెషన్ సమావేశాలు గతేడాది డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమయ్యాయి. కాగా, సమావేశాలు 18 రోజులపాటు కొనసాగి ఈ నెల 18న ముగిశాయి. అయితే, 27వ తేదీ నుంచే సమావేశాలు ప్రోరోగ్ అయ్యాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దు.. గవర్నర్‌కు టి.మంత్రుల వినతి
తెలంగాణ బిల్లు త్వరలో శాసనసభకు రానున్న సమయంలో అసెంబ్లీని నిరవధికంగా వాయిదా(ప్రొరోగ్) వేయవద్దని ఆ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయించాలన్న ప్రయత్నాల్ని ఆమోదించరాదని విన్న వించారు. మంగళవారం మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజ్ సారయ్య గవర్నర్‌తో భేటీఅయ్యూరు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి టీ-బిల్లు రాగానే అసెంబ్లీని సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరామన్నారు. అసెంబ్లీ అభిప్రాయ సేకరణను వెంటనే పూర్తిచేయించి బిల్లు రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
ప్రొరోగ్ వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసనమండలి ప్రొరోగ్ వివాదం ముగిసింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ సంబంధిత పత్రాలను శనివారం ప్రభుత్వానికి పంపారు. మండలిని కూడా ప్రొరోగ్ చేస్తూ చైర్మన్ చక్రపాణి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రొరోగ్ అంశం సీఎం-స్పీకర్ వివాదంగా మారి తీవ్ర చర్చకు దారి తీయడం తెలిసిందే. చివరికి కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆర్డినెన్సుల జారీకి అడ్డంగా ఉందనే కారణంతోనే అసెంబ్లీని పొరోగ్ చేయాలంటూ లేఖ రాసినట్టు వివరించాయి. వివాదం సద్దుమణగడంతో ప్రొరోగ్ లేఖలను చైర్మన్, స్పీకర్ శనివారం ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. అయితే స్పీకర్ పంపిన ప్రొరోగ్ లేఖ శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా సీఎంఓకు, అక్కడి నుంచి గవర్నర్‌కు చేరాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రొరోగ్తో అనుమానాలు: శ్రీధర్‌బాబు శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున సభను ప్రొరోగ్ చేయడం వల్ల అనేక సందేహాలు నెలకొనే అవకాశాలున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్పీకర్ సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడం వల్ల అపోహలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయవద్దని గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. సబ్సిడీ గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానించే విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఆధార్ పొందటం వల్ల అన్ని విధాలా ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement