రోడ్డుప్రమాదంలో తాత,మనవడు మృతి

29 Oct, 2015 17:26 IST|Sakshi

మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు మృతిచెందారు. బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో తాత కొమ్మినేని వెంకటేశ్వరరావు(70) ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మనవడు కొమ్మినేని సుధాకర్(15)ను మైలవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు