కేతన్‌జైన్.. చిక్కడు.. దొరకడు

8 Jan, 2014 11:57 IST|Sakshi
కేతన్ జైన్

సిరిసిల్ల వస్త్రవ్యాపారులను నమ్మించి, కోటి రూపాయల వస్త్రంతో ఉడాయించిన గుజరాత్ వ్యాపారి కేతన్‌జైన్ ఇంకా దొరకలేదు. అతడి కోసం పోలీసులు మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు వెళ్లినా లాభం లేకపోయింది. కేతన్ పట్టుబడతాడని ఆశించిన వ్యాపారులు ఈ విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు.
 
 రాజస్థాన్, మహారాష్ట్ర వెళ్లినాకానరాని ఫలితం
 అన్వేషణ ఖర్చులు రూ.3.50 లక్షలు వృథా
 రెంటికీ చెడ్డ రేవడిగా సిరిసిల్ల వస్త్రవ్యాపారులు
 
సిరిసిల్ల : కేతన్ జైన్ తనది ఢిల్లీ అని చెప్పి సిరిసిల్ల వస్త్రవ్యాపారులను నమ్మించాడు. తప్పుడు సమాచారంతో వారి వద్ద నమ్మకంగా ఉన్నాడు. నాలుగు నెలల పాటు డబ్బులు నగదుగా ఇ స్తూ.. వస్త్రాన్ని కొనుగోలు చే శాడు. ఆ తర్వాత పాతిక మంది దగ్గర రూ. కోటి విలువైన వస్త్రా న్ని ఉద్దెరగా తీసుకుని ఉడాయించాడు. బాధిత వ్యాపారులు ఫిర్యాదు చేయగా నవంబరు 20న పోలీసులు కేసు నమోదుచేశారు.


 
 అతడి ఫోన్ నంబర్ల 9705632772, 8008601447 ఆధారం గా జైన్‌ది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌గా గుర్తిం చారు. వ్యాపారులను వెంట తీసుకుని పోలీ సులు అక్కడికి వెళ్లారు. కేతన్ సొంత ఇంటిని, అతడి పిల్లలు చదువుకునే స్కూల్‌ను సైతం గు ర్తించారు. దీంతో ఇక కేతన్ దొరికినట్లేనని భావించి టౌన్ సీఐ నాగేంద్రాచారి, మరో టీఆర్‌ఎస్ నాయకుడు అక్కడికి వెళ్లారు. కానీ అతడు దొరకలేదు.  పది రోజుల పాటు అక్కడే ఉండి  గాలించినా జైన్ చిక్కక పోవడంతో పోలీసులు, వ్యాపారులు నిరాశచెందారు.


 
 రెండింటికీ చెడ్డారు..
 పోలీసులు కేతన్‌జైన్ అన్వేషణలో రూ. 3.50లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని బాధిత వ్యాపారుల వద్ద వసూలు చేసినట్లు తెలిసింది. అటు కేతన్ దొరక్కపో గా.. అతని వేట పేరిట పోలీసులు రూ.3.50లక్షల మేర ఖర్చులు చూపడం వస్త్రవ్యాపారులను ఆందోళన కు గురిచేస్తోంది. కేతన్ చిక్కితే.. కొంతైనా డబ్బులు వస్తాయనే ఆశతో వ్యాపారులు పోలీసులకు సహకరించినట్లు సమాచారం. 45 రోజులుగా కేసు పురోగతి లేక.. వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


 
 స్థానికంగా తీవ్ర ప్రభావం..
 సిరిసిల్ల వస్త్ర వ్యాపారంలో నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం సాగిస్తుంటారు. గుడ్డను  అరువుపై తీసుకుని వారం, పది రోజుల్లో డబ్బు లు తిరిగి ఇవ్వడం ఇక్కడ పరిపాటి.  కానీ కేతన్‌జైన్ సంఘటన నేపథ్యంలో ఉద్దెర నమ్మేందుకు వ్యాపారులు వెనకంజ వేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చేతులెత్తేస్తారో అన్న భయంతో ఉన్నా రు. ఫలితంగా నమ్మకం పంచన సాగే వ్యా పారం స్వరూపం ఒక వంచన కారణంగా మొత్తంగా మారిపోయింది. పోలీసులు కేతన్‌జైన్‌ను పట్టుకుంటే.. కాస్తయినా వ్యాపారులకు నమ్మకం కలిగేది. కానీ అతడు దొరకలేదు. ఈ సంఘటన కారణంగా నష్టపోయిన వ్యాపారు లు దిక్కులు చూస్తుండగా.. నమ్మకంగా వ్యాపా రం చేసే వారు  ఉద్దెర ఇచ్చే వారు లేక ఇబ్బం దులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు