‘ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక యాప్‌’

10 Oct, 2019 17:06 IST|Sakshi

సాక్షి, కృష్ణా : నియోజకవర్గంలోని ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. సింగ్‌నగర్‌లోని  వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్టంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే నవరత్నాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అర్హులైన పేదలకు రూ. 2250 పెన్షన్‌ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

సీఎం జగన్‌ ఇచ్చిన మాట మీద నిలబడి పేద ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని పథకాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని అన్నారు. వాహన మిత్ర ద్వారా జిల్లాలోని 5000 వేలకు పైగా ఆటో, ట్యాక్సీ కార్మికులకు రూ. 10000 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని పదమూడు మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ. 11 లక్షలు అందించామని మల్లాది విష్ణు తెలిపారు. 

మరిన్ని వార్తలు