ఈ వేసవికి మరింత రద్దీ

16 Feb, 2018 11:31 IST|Sakshi
అన్నప్రసాద వితరణ పరిశీలిస్తున్న ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు

తిరుమలకు వేసవి సెలవుల్లో ఏటా భక్తుల తాకిడి

ఈసారి మరింత పెరిగే అవకాశం

సంతృప్తికర దర్శన కల్పనకు చర్యలు

పక్కాగా టైంస్లాట్‌ సర్వదర్శనం అమలు

టీటీడీ ఈఓ, జేఈఓల ఆదేశం

రానున్న వేసవి సెలవుల్లో తిరుమలలో ఏర్పాట్లపై టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.  రద్దీని తట్టుకుని భక్తులకు సంతృప్తికరసేవలందించాలని కసరత్తు ప్రారంభమైంది. ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం, బస, కల్యాణకట్ట, లడ్డూ , అన్నప్రసాదాల పంపిణీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించింది. వేసవిలో అన్ని విభాగాలు సమష్టిగా పనిచేయాలనిటీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

సాక్షి, తిరుమల: వస్తున్న వేసవి సెలవుల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంద ని టీటీడీ అంచనా వేసింది. ఏప్రి ల్‌ రెండో వారం నుంచి మే, జూన్‌ నెలల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని గతానుభవం..గణాంకాలు చెబుతున్నాయి.  ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని  టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ కేఎస్‌ శ్రీనివాసరాజు భావిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. గత వేసవిలో మాత్రమే రోజుకు 77 వేల నుంచి 81 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి అంతకంటే  ఎక్కువ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సారి తోపులాటల్లేని దర్శనం కల్పించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్ల నుంచి వెలుపల వచ్చిన భక్తులకు ఆలస్యం లేకుండా గంటలోపే స్వామి దర్శనం కలిగేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపై వైకుం ఠం, ఆలయ అధికారులతో పలు సందర్భాలు సమీక్షించారు.

ఈసారి వేసవిలో  టైం స్లాట్‌ సర్వదర్శనం అమలు
టీటీటీడీ కొత్తగా రూ.300 టికెట్లు, కాలిబాట భక్తుల తరహాలోనే సర్వదర్శనానికి టైంస్లాట్‌ విధానం అమలు చేయనుంది. మార్చి రెండోవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  ఇదే సందర్భంలో కంపార్ట్‌మెంట్లలోకి వచ్చే భక్తులకు పాత వి«ధానంలోనూ సర్వదర్శనం కల్పించనుంది. ఏకకాలంలో అన్ని రకాల దర్శనాల అమలు విషయంలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.

బస, కల్యాణకట్ట, లడ్డూ, అన్నప్రసాదంపై వితరణకు ప్రాధాన్యం
తొలుత  సులభంగా గదులు లభించే చర్యలు చేపట్టారు. తిరుమలకొండ మీద ఉండే సుమారు 7 నుంచి 8 వేల గదులు భక్తులకు ల భించేలా చేపట్టారు. గత ఏడాది గదుల వినియోగ శాతం 110 నుంచి 120 శాతానికి పెరిగింది.
యాత్రిసదన్లలో కూడా సౌకర్యాలు రెట్టింపు చేసి వేసవి సెలవుల్లో మరింత మంది వినియోగించుకునేలా ముందస్తు చర్యలు చేపట్టారు.
తలనీలాల వద్ద ఆలస్య నివారణ చర్యలు పెంచారు. ప్రధాన కల్యాణకట్టతోపాటు   మినీ కల్యాణకట్టల్లో కూడా త్వరగా భక్తులకు తలనీలాలు సమర్పించుకునే చర్యలు చేపట్టారు. టీటీడీ నాయీబ్రాహ్మణులతోపాటు పీస్‌ రేట్‌ కార్మికులతోపాటు మరో 930 మంది  శ్రీవారి కల్యాణకట్ట సేవకుల సేవల్ని వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు.
వెలుపల వచ్చిన భక్తులు సులభంగా లడ్డూ ప్రసాదం పొందేలా అన్ని కౌంటర్లు వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఇప్పటికే నడిచి వచ్చే భక్తుడికి ఐదు, సర్వదర్శనం భక్తుడికి నాలుగు, రూ.300 టికెట్ల భక్తుడికి నాలుగు చొప్పున ఇస్తున్నారు. రద్దీ రోజుల్లోనూ ఈ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు.
ఆలయం వెలుపల రూ.50 చొప్పున  అదనపు లడ్డూలు విక్రయించే చర్యలు  పక్కాగా చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు 30 వేలు ఇస్తుండగా, వేసవిలో ఈ సంఖ్య 50 వేలకు తగ్గకుండా సరఫరా చేయనున్నారు.
టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ శ్రీనివా సరాజు భక్తుల ఏర్పాట్ల విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.

సందర్శించిన భక్తుల సంఖ్య
2016 ఏప్రిల్‌లో   20.5 లక్షలు
2017 ఏప్రిల్‌లో 22.10 లక్షలు
2016  మేలో 25.82 లక్షలు
2016 మేలో 26.55 లక్షలు
2016 జూన్‌లో 24.97 లక్షలు
2017 జూన్‌లో 25.77 లక్షలు

మరిన్ని వార్తలు