హైకోర్టు కోసం నిరసన తీవ్రతరం | Sakshi
Sakshi News home page

హైకోర్టు కోసం నిరసన తీవ్రతరం

Published Fri, Feb 16 2018 11:37 AM

protest for highcourt in rayalaseema - Sakshi

పుంగనూరు: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేపట్టిన ఉద్యమం ఊపందుకుంది. గురువారం వారు మోటారు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.   పోలీస్‌ స్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌రెడ్డెప్ప, మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ 25 రోజులుగా శాంతియుత ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వం  పట్టించుకోక పోవ డం బాధాకరమన్నారు. నేడు రాష్ట్రం అధోగతిపాలుకావడానికి ప్రధాన కారకులు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులే కారణమని తెలిపారు. 

విభజన సమయంలో చెప్పినదానికి  భిన్నంగా అమరావతిలో కార్యాలయాలను ఆగమేఘాలపై ఏర్పాటు చేస్తోందన్నారు. న్యాయవాదులు ప్రజలు, రాయలసీమ అభివృద్ధి  కోసం ఆందోళన చేపడుతున్నారే తప్ప స్వలాభాపేక్ష లేదని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ నుంచి ఎన్నికైనా పట్టించుకోకపోవడం శోచనీయమ న్నారు. కరువుకాటకాలతో వెనుకబడి ఉన్న రాయలసీమలో  హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోని పక్షంలో నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు,   పాల్గొన్నారు.

Advertisement
Advertisement