ఇంటి వద్దకే బియ్యం

8 Sep, 2019 08:25 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లాలో పడవల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యం బస్తాలు, శ్రీకాకుళంలో గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ

రెండు రోజుల్లోనే 70 శాతం పైగా ఇళ్లకు చేరిన బియ్యం బ్యాగ్‌లు

శ్రీకాకుళం జిల్లా పేదల ఆనందం

సాక్షి, అమరావతి : కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి రేషన్‌ బియ్యం సక్రమంగా అందేవి కావు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు. 

వర్షం కారణంగా తడిసిన 30 బ్యాగ్‌లు
నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 30 బియ్యం బ్యాగ్‌లు తడిసిపోయాయి. వాటిలోని బియ్యం ఉండలు కట్టినట్టు గుర్తించకపోవడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ బ్యాగ్‌లను అందుకున్న లబ్ధిదారులు బియ్యం ఉండకట్టిన విషయాన్ని వలంటీర్లకు తెలియజేయడంతో వాటి స్థానంలో కొత్త బ్యాగ్‌లను తిరిగి పంపిణీ చేశారు. బియ్యం పంపిణీ ఎలా ఉందన్న దానిపై లబ్ధిదారుల అభిప్రాయాల్ని వలంటీర్లు తీసుకుంటున్నారు. బియ్యం చాలా బాగున్నాయని పేదల నుంచి అభినందనలు వస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి నాని విమర్శించారు.

చీపురుపల్లి వాసుల ఆనందం
ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమ ఇళ్లకే నేరుగా బియ్యం తెచ్చి ఇస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ పరిధిలోని చీపురుపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బియ్యం కోసం 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదని.. ఈ–పాస్‌ మెషిన్లు సరిగా పనిచేయక ఒక్కోసారి రెండు మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. గిరిజన గూడేల్లోనూ ఇంటికే బియ్యం అందుతుండటంతో పేదల ఆనందం అవధులు దాటింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యురేనియం కాలుష్యానికి ముకుతాడు

పరిటాల కుటుంబంతో ప్రాణహాని

అనంతపురం తాజ్‌మహల్‌

కిలిమంజారో ఎక్కేశాడు

భర్తకు తెలియకుండా గర్భం.. దీంతో భయపడి..

నిండు కుండల్లా..

తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

భూకబ్జాలపై కొరడా

ఆటలో గెలిచి.. చిన్న మాటకే జీవితంలో ఓడి..

‘బియ్యం బాగున్నాయంటూ ప్రశంసలు’

‘ఆ కేసులపై పునర్విచారణ చేయిస్తాం’

ఈనాటి ముఖ్యాంశాలు

'జగన్‌ ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారు'

ఇది చంద్రబాబు కడుపు మంట

‘మతి భ్రమించే చంద్రబాబు అలా చేస్తున్నారు’

పచ్చ నేత చెరవీడిన తెలుగు గంగ స్థలం

నవరాత్రుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి

ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

అక్కసుతో రాజకీయాలు చేయొద్దు..

అమరావతికి అడ్రస్‌ లేకుండా చేశారు: బొత్స

‘మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి ’

సీఎం జగన్‌తో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’

‘ఆ భయంతోనే చంద్రబాబు తప్పుడు విమర్శలు’

‘యురేనియం’ గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన

చంద్రబాబు ఓవరాక్షన్‌ తగ్గించుకో: అంబటి

కలగానే ఇరిగేషన్‌ సర్కిల్‌!

ఏటీఎం పగులకొట్టి..

సిండి‘కేట్లు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

నయా లుక్‌