క్వారంటైన్‌ కేంద్రంలో గర్భిణి ప్రసవం

12 Apr, 2020 09:03 IST|Sakshi
గర్భిణికి చెక్కు, బేబీ కిట్‌ను అందజేసిన కలెక్టర్‌ నివాస్‌

సంరక్షణ కోసం రూ.25 వేలు అందజేసిన కలెక్టర్‌

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ క్వారంటైన్‌ కేంద్రంలో 13 రోజులుగా ఉంటున్న ఓ వలస కూలీ శనివారం ప్రసవించింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ వలస కూలీగా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా పాలకొండ క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటోంది. నిండు గర్భిణి అయిన ఆమెను ప్రసవం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆసుపత్రి పరిశీలనకు వెళ్లి విషయం తెలుసుకుని ఆమెకు బేబీ కిట్‌ను అందజేశారు. అలాగే పుట్టిన బిడ్డ సంరక్షణకు రూ.25 వేలు అందజేశారు. అక్కడ అందించిన సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. 

,

మరిన్ని వార్తలు