అత్యవసరంలో స్పందించిన రక్తదాత

12 Mar, 2018 09:51 IST|Sakshi
రక్తదానం చేసిన శివప్రశాంత్‌ రెడ్డి

మహిళ శస్త్ర చికిత్సకు దోహదం 

కొడవలూరు: మై పాడుకు చెందిన ఓ యువకుడు అత్యవసర సమయంలో ఓ మహిళకు రక్తదానం చే సి ఆదుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. నె ల్లూరు నారాయణ వైద్యశాలలో ప్రసవం నిమిత్తం తులసి అనే మహిళ చేరగా, ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకోసం ఏ నెగటివ్‌ రక్తం అవసరమైంది. ఆ గ్రూపు రక్తం ఆస్పత్రిలో అందుబాటులో లేకపోగా, బ్లడ్‌ బ్యాంక్‌లలోనూ లభించలేదు. దీంతో ఆమె బంధువులు కొడవలూరు మండలానికి చెందిన మీకోసం మేము ఫౌండేషన్‌ సభ్యులను సంప్రదించారు.

వారిలోనూ ఎవరికీ ఆ గ్రూపు రక్తం ఎవరికీ లేదు. మరో వైపు గర్భిణికి శస్త్ర చికిత్స అత్యవసరంగా పరిణమించింది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఆ గ్రూపు రక్తం కలిగిన మైపాడుకు చెందిన దేవిరెడ్డి శివప్రశాంత్‌రెడ్డి అనే యువకుడిని ఫౌండేషన్‌ అధ్యక్షుడు పోసిన సునీల్‌కుమార్‌ ఫోన్‌లో సంప్రదించి రక్తమివ్వాలని కోరారు. అత్యవసరాన్ని గ్రహించిన ఆ యువకుడు మానవతతో స్పందించి ఆ రాత్రే ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి ఆ మహిళ శస్త్ర చికిత్సకు దోహద పడ్డాడు. తులసి ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చిందని ఫౌండేషన్‌ అ«ధ్యక్షుడు తెలిపారు.

>
మరిన్ని వార్తలు