రూపాయి భయపెడుతోంది!

22 Nov, 2016 00:49 IST|Sakshi
రూపాయి భయపెడుతోంది!

డాలరుతో పోలిస్తే 68.27 స్థారుుకి పతనం
ట్రంప్ గెలుపు, ఫెడ్ రేట్ల పెంపు అంచనాల ప్రభావం
మన వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాల వల్ల కూడా
68.85 కన్నా దిగువకు తగ్గకపోవొచ్చు: నిపుణులు
ఇంకా పెరిగితే పెట్రోలు, బంగారం ధరల పెరుగుదల
ఐటీ, ఫార్మా రంగాలకు మాత్రమే కొంత లాభం!

సాక్షి, బిజినెస్ విభాగం
మూడున్నరేళ్ల కిందట... అంటే 2013 ఆగస్టులో ఏం జరిగిందో గుర్తుందా? డాలరుతో పోలిస్తే రూపాయి దారుణంగా పడిపోరుుంది. దిగుమతి చేసుకునే వస్తువల ధరలు భారీగా పెరిగిపోయారుు. సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకూ అంతా బెంబేలెత్తిపోయారు. మళ్లీ ఇపుడు అదే పరిస్థితులు తలెత్తుతున్నాయా...! అనే భయాలు వ్యక్తమవుతున్నారుు. ఎందుకంటే ఈ సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో... రూపాయి అప్పటి రికార్డు కనిష్టస్థారుు 68.85 సమీపానికి చేరింది. కేవలం పది రోజుల్లో 200 పైసలు నష్టపోరుున రూపాయి తాజాగా 68.27 స్థారుుకి వచ్చి చేరింది. ఇది మరింతగా తగ్గితే, మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సహా దిగుమతయ్యే ప్రతి ఉత్పత్తి ధరా పెరిగిపోతుంది. అసలే పెద్ద నోట్ల రద్దుతో రోజువారీ ఖర్చులకు కరెన్సీ నోట్లు లేక అల్లాడుతున్న ప్రజల నెత్తిమీద ధరల భారం పడే ప్రమాదం రూపాయి రూపంలో పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది.

ఎందుకీ పతనం...?
వాస్తవానికి పెద్ద నోట్ల రద్దుతో సాంకేతికంగా చూస్తే రూపాయి విలువ పెరగాలి. ఎందుకంటే వ్యవస్థలో ద్రవ్య సరఫరా తగ్గుతుంది. దీంతో వస్తూత్పత్తులకు కూడా తగినంత డిమాండ్ లేక వాటి ధరలు తగ్గుతారుు. వీటివల్ల రూపారుు విలువ మెరుగ్గా ఉండాలి. కానీ అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు అనుగుణంగా లేవు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ లాంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలించుకు వెళుతున్నారు.

అమెరికాలో వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాలతో అక్కడి మార్కెట్లలోకి చాలావరకూ పెట్టుబడులు తరలివెళుతున్నారుు. వాళ్లంతా రూపారుుల్లో ఉన్న తమ పెట్టుబడులను విక్రరుుంచేసి, డాలరు రూపంలో తరలించుకుపోతారు. డాలరుకు డిమాండ్ పెరిగి... ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే దాని విలువ కూడా పెరిగిపోతూ ఉంది. దీంతో భారత్ రూపారుు, ఇండోనేషియా రూపయ్య, చైనా యువాన్, ఫిలిప్సీన్‌‌స పెసో తదితర కరెన్సీలు పతనమవుతున్నారుు. భారత క్యాపిటల్ మార్కెట్ నుంచి ఈ నెలలో  ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు 250 కోట్ల డాలర్ల మేర నిధుల్ని ఉపసంహరించుకున్నారు.

వడ్డీ రేట్ల ప్రభావం కూడా...
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ నెలలో పావుశాతం వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లో బలంగా వున్నారుు. మరోవైపు మనదేశంలో డీమోనిటైజేషన్‌తో బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా డిపాజిట్లు రావడంతో రిజర్వు బ్యాంక్ డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలూ ఉన్నారుు. అంటే..అమెరికాలో వడ్డీ రేట్ల పెరగవచ్చు. ఇండియాలో తగ్గవచ్చు. ఈ పరిస్థితి విదేశీ ఇన్వెస్టర్లకు మింగుడుపడనిది. వారు అక్కడ తక్కువ వడ్డీకి నిధుల్ని తీసుకొచ్చి, ఇక్కడ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లబ్దిపొందుతున్నారు. ఇరు దేశాల్లో వడ్డీ రేట్లలో జరిగే మార్పులవల్ల వారికి లాభం బాగా తగ్గిపోరుు, రిస్క్ పెరిగిపోతుంది. ఇదే సమయంలో రూపారుు క్షీణిస్తూవుంటే వారికి నష్టాలొచ్చే అవకాశం ఉంటుంది. దాంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లలో విక్రయాలు జరుపుతున్నారు. రూపారుు క్షీణిస్తూ ఉంటే వారి అమ్మకాలు మరింత పెరగడం, రూపారుు మరింత క్షీణించడం జరుగుతుంది.

పెనుముప్పు లేదంటున్న నిపుణులు...
రూపారుు ప్రస్తుతం క్షీణిస్తున్నా, ఈ పతనం తీవ్రస్థారుులో ఉండబోదన్నది నిపుణుల మాట. 2013 నాటికంటే ప్రస్తుతం దేశీయ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, అప్పటికంటే ఇప్పుడు ఇండియా వద్ద 200 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు అధికంగా వున్నాయని, కరెంటు ఖాతాలోటు 1 శాతానికే (దేశంలోకి వచ్చి, పోయే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) పరిమితమై వుందని వారు విశ్లేషిస్తున్నారు. రూపారుు విలువ 68.40 స్థారుు కంటే పడిపోకపోవచ్చని ప్రసిద్ధ విదేశీ బ్రోకింగ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సీనియర్ ఎకానమిస్ట్ రాజీవ్ మాలిక్ అంచనా వేశారు.

అరుుతే అమెరికా ఫెడ్ ఈ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచడంతో పాటు వెంటవెంటనే మరో రెండు దఫాలు వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఏర్పడితే మాత్రం రూపారుు మరింత పతనం కావొచ్చని ఆయన చెప్పారు. 2013 ఆగస్టునాటి కనిష్టస్థారుు కంటే దిగువకు తగ్గే అవకాశాలు తక్కువని ఫస్ట్‌ర్యాండ్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ హరిహర్ అభిప్రాయపడ్డారు. 2017 తొలి త్రైమాసికంలో రూపారుు విలువ 68.50 వరకూ తగ్గొచ్చని.. డిసెంబర్ నాటికి 69.50 వరకూ పడిపోవచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌ఎస్‌బీసీ తాజా అంచనాల్లో పేర్కొంది.

లాభాలకంటే నష్టాలే ఎక్కువ..
భారతదేశం వరకూ రూపారుు క్షీణతవల్ల నష్టాలే ఎక్కువ. ఎందుకంటే మనం అధికంగా వినియోగించే పెట్రో ఉత్పత్తులకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా వున్నా, ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే పెరిగిపోతాయ్. ఇవి పెరిగితే రవాణా వ్యయాలు పెరిగి, మిగిలిన ఉత్పత్తుల ధరలూ పరుగులు తీస్తారుు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఇటీవలి కనిష్ట స్థారుు నుంచి 12 శాతం పెరగ్గా, ఇక్కడ ఎంసీఎక్స్‌లో ట్రేడయ్యే క్రూడ్ బ్యారల్ ధర రూపారుు క్షీణత ఫలితంగా 14.5 శాతం ఎగిసింది. అలాగే బంగారం ధర కూడా...అంతర్జాతీయ మార్కెట్లో పెరక్కపోరుునా, ఇక్కడ మాత్రం 3 శాతం వరకూ పెరిగింది. ఇక మనం దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా రూపారుు క్షీణతతో పెరుగుతారుు. ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానమై ట్రేడయ్యే  చక్కెర, వంటనూనెలు, కొన్ని రకాల పప్పు దినుసుల ధరలకు సైతం రెక్కలు వస్తారుు. చివరికి వారాపత్రికలు ఉపయోగించే న్యూస్‌ప్రింట్ ధర కూడా ఖరీదైపోతుంది.

ఎగుమతులకు కాస్త ప్రయోజనం..
రూపారుు క్షీణత ఎగుమతి ఆధారిత రంగాలకు బాగా కలిసివస్తుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీల లాభాల మార్జిన్లు 0.25-0.50% మేర పెరగవచ్చని అంచనా. కానీ అమెరికాలో ట్రంప్ విజయంతో ఈ కంపెనీలు రూపారుు ప్రయోజనాన్ని ఏ మేరకు అందిపుచ్చుకుంటాయన్న అనుమానాలూ ఉన్నారుు. కరెన్సీ క్షీణత ఫలితాన్ని పొందగలిగే మరో రంగం ఫార్మా. ఇది కూడా ట్రంప్ విధానానాలపై ఆధారపడి ఉంటుంది.

తక్షణ లాభం రెమిటెన్సులకే..
విదేశాల నుంచి ఇక్కడికి తరలివచ్చే రెమిటెన్సులకు మాత్రం తక్షణ ప్రయోజనం కలుగుతుంది. ఎన్నారైలు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇక్కడికి బంధువులకు, పెట్టుబడుల కోసం పంపే డబ్బు రూపారుుల్లో పెరగడం ద్వారా లబ్ది చేకూరుతుంది. కానీ విదేశాల్లో విద్యనార్జించేందుకు తీసుకున్న రుణాలు భారమైపోతారుు. విదేశీ ప్రయాణాలు ఖరీదవుతారుు.

మరిన్ని వార్తలు