ఆపిల్‌ వాచ్‌ బైపాస్‌ సర్జరీ చేస్తుందట!!

13 Sep, 2018 12:09 IST|Sakshi

టెక్‌ ప్రపంచంలో సెప్టెంబర్‌ 12.. ఓ ఐకానిక్‌’ డే. ఎన్నో రూమర్లు, మరెన్నో లీక్‌ల అనంతరం ఆపిల్‌ తన సరికొత్త ఐఫోన్లను సెప్టెంబర్‌ 12 ప్రవేశపెట్టింది. ఐఫోన్లతో పాటు ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను దీనిలో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని ఇది లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ  తీసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఐఫోన్లను డ్యూయల్‌ సిమ్‌ ఫీచర్‌తో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఆపిల్‌ ప్రొడక్ట్‌లపై సోషల్‌ మీడియా మాత్రం జోకులు వేయడం ఆపలేదు. 

2018 ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4 ఈసీజీ ఫీచర్‌ ఉంటే, 2019 వాచ్‌లో యాంజియోప్లాస్టీ, 2020 వాచ్‌లో బైపాస్‌ సర్జరీ, 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయంటూ ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. మనం 2018లో జీవిస్తుంటే, ఆపిల్‌ ఇంకా 2012లోనే నివసిస్తుందంటూ డ్యూయల్‌ సిమ్‌ ఫీచర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి ఒక టేబుల్‌ వద్ద కూర్చుని ఐఫోన్‌ ఆపిల్‌ లోగోతో వస్తుందని చెబుతున్న కార్టూన్‌ గీయగా.. మరోవ్యక్తి, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అవే ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న పిక్చర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందపడిపోవడాన్ని ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 4 గుర్తిస్తుంది, అవునా..అయితే కొంతమంది రూపాయిని ధరిస్తారు అంటూ మరో యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు