-
ఆపిల్ వాచ్ బైపాస్ సర్జరీ చేస్తుందట!!
టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ 12.. ఓ ఐకానిక్’ డే. ఎన్నో రూమర్లు, మరెన్నో లీక్‌ల అనంతరం ఆపిల్ తన సరికొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 12 ప్రవేశపెట్టింది. ఐఫోన్లతో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను దీనిలో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని ఇది లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ తీసుకోవచ్చు. మొట్టమొదటిసారి ఐఫోన్లను డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ సరికొత్త ఆపిల్ ప్రొడక్ట్‌లపై సోషల్ మీడియా మాత్రం జోకులు వేయడం ఆపలేదు. 2018 ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఈసీజీ ఫీచర్ ఉంటే, 2019 వాచ్‌లో యాంజియోప్లాస్టీ, 2020 వాచ్‌లో బైపాస్ సర్జరీ, 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మనం 2018లో జీవిస్తుంటే, ఆపిల్ ఇంకా 2012లోనే నివసిస్తుందంటూ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఓ వ్యక్తి ఒక టేబుల్ వద్ద కూర్చుని ఐఫోన్ ఆపిల్ లోగోతో వస్తుందని చెబుతున్న కార్టూన్ గీయగా.. మరోవ్యక్తి, ఆండ్రాయిడ్ ఫోన్ అవే ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్న పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిందపడిపోవడాన్ని ఆపిల్ వాచ్ సిరీస్ 4 గుర్తిస్తుంది, అవునా..అయితే కొంతమంది రూపాయిని ధరిస్తారు అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Apple watch features 2018 : ECG 2019 : Angioplasty 2020 : Bypass Surgery 2021: Funeral arrangements#AppleEvent — SAGAR (@sagarcasm) September 12, 2018 IPhone fans right now #AppleEvent pic.twitter.com/nuQgOyaMWt — Mask ishan (@Mr_LoLwa) September 12, 2018 We’re all living in 2018 while Apple is living in 2012 #AppleEvent pic.twitter.com/hJnyfbGgbK — 9GAG (@9GAG) September 13, 2018 Android be like : Launch wo kar rahein hain par features humaare hain.#AppleEvent pic.twitter.com/v24iRk4tst — SAGAR (@sagarcasm) September 12, 2018 Reality check. #AppleEvent #iphoneXs pic.twitter.com/tC6wBYFqAc — Godman Chikna (@Madan_Chikna) September 12, 2018 me @ my iPhone 📱 after seeing the new prices #AppleEvent pic.twitter.com/xPJW1iB4vV — Khattak (@Nayapakistan_55) September 12, 2018 Fixed it. #AppleEvent pic.twitter.com/6Y1cHkcrzY — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Samsung fans watching #AppleEvent and realising they can’t even taunt you about dual sim anymore. pic.twitter.com/Ka2nksuv15 — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 12, 2018 Me and my broke friends checking the price of the new iPhone. #AppleEvent pic.twitter.com/88a1yUyeDm — Bade Chote (@badechote) September 12, 2018 -
తెగ నవ్విస్తున్న రాందేవ్ ఫొటో
న్యూఢిల్లీ: రాందేవ్ బాబా అనగానే టక్కున ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది యోగా. ఆయన దేశీయంగానే కాక విదేశాల్లో సైతం భారతీయ యోగా విద్యకు ఎనలేని ప్రాముఖ్యం తెచ్చారు. అంతేకాకుండా పతంజలి పేరిట పలు ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశ పెట్టి పరోక్షంగా పెద్ద బిజినెస్ మేన్ గా కూడా అవతరించారు. అయితే, ఆయన వివాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఆయనపై చాలాసార్లు సెటైర్లు వేసిన సందర్భాలు కూడా తక్కువేం కాదు. ఏదైమైనా యోగా విద్యకు ఆయన తెచ్చిన ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇండియా టుడే రాందేవ్ ఫొటోను కవర్ పేజీ ఫొటోగా వేసింది. ఇందులో ఆయన ప్రసారిత పడోట్టానాసన అనే ఆసనాన్ని వేసిన చిత్రాన్ని ముద్రించారు. ఇందులో ఆయన తన శరీరంమొత్తాన్ని నడుం నుంచి కిందికి ముందుకు వంచి కాళ్ల సందులో నుంచి తలతో చూసినట్లుగా ఉంది. ఆ స్టిల్లే ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయి పెద్ద హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోను తీసుకొని పలువురు నెటిజన్లు ట్విటర్ లో కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. జెట్ విమానాలతో యుద్ధానికి దూసుకెళుతున్నట్లు, రాకెట్ లాగా ఆకాశంలోకి రయ్‌మని ఎగురుతున్నట్లు, గోల్ కీపర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు, స్విమ్మింగ్ కోసం భంగిమ పెట్టినట్లు, ప్యారాచూట్ ప్రాక్టిస్ చేస్తున్నట్లు రకరకాల కామెంట్లు పెట్టారు. అంతేకాదు, తమ ఫొటో షాప్ కు పదును పెట్టి అచ్చం అలాంటి చిత్రాలు కూడా పోస్ట్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement